MVRTalks
18/9/2026

Amaravati Quantum Valley: క్వాంటమ్ యుగానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతోందా?

తెలుగు

క్వాంటమ్ యుగానికి అమరావతి సిద్ధమవుతోందా?

ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రపంచ క్వాంటమ్ రేసులో భారత ప్రయాణం

AI తర్వాత ప్రపంచాన్ని మార్చబోయే సాంకేతికత ఏది? ఈ ప్రశ్నకు ఎక్కువగా వినిపిస్తున్న సమాధానాల్లో ఒకటి — Quantum Computing.

Artificial Intelligence ప్రస్తుతం మనం పని చేసే విధానాన్ని మార్చుతోంది. Quantum Computing మాత్రం భవిష్యత్తులో కొన్ని అత్యంత క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే కంప్యూటింగ్ సామర్థ్యాన్నే మార్చే అవకాశం కలిగిన సాంకేతికత. ఇలాంటి సమయంలో భారతదేశంలోని ఒక రాష్ట్రం తన రాజధానినే Quantum Technology కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రయత్నించడం విశేషం. ఆ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆ కేంద్రం అమరావతి.

అమరావతిలో ఏర్పడుతున్న Quantum Valley విజయవంతమైతే అది కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మరో IT Project కాదు. భారతదేశం ప్రపంచ Quantum Raceలో ఎంత వేగంగా ముందుకు సాగగలదన్న దానికి ఒక ముఖ్యమైన ప్రయోగశాలగా మారవచ్చు.

క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి?

మన రోజువారీ కంప్యూటర్లు సమాచారం ప్రాసెస్ చేయడానికి Bitsను ఉపయోగిస్తాయి. Quantum Computers మాత్రం Qubitsను ఉపయోగిస్తాయి. Quantum Physicsలోని Superposition, Entanglement వంటి లక్షణాలను ఉపయోగించడం వల్ల కొన్ని ప్రత్యేక సమస్యల్లో సాధారణ కంప్యూటర్లకు సాధ్యం కానంత విస్తృతమైన గణనలను నిర్వహించే అవకాశం ఏర్పడుతుంది.

Quantum Computer మన Laptopకు ప్రత్యామ్నాయం కాదు. కానీ Drug Discovery, New Materials, Financial Modelling, Logistics, Cybersecurity, Cryptography, Energy Systems, Complex Optimisation వంటి రంగాల్లో ఇది భవిష్యత్తులో కీలక సాధనంగా మారవచ్చు.

అమరావతి Quantum Valley — ఒక కంప్యూటర్ కంటే పెద్ద ఆలోచన

Andhra Pradesh Quantum Valley ప్రాజెక్ట్‌ను కేవలం “ఒక పెద్ద Quantum Computer అమరావతికి వస్తోంది” అనే కోణంలో చూడటం సరిపోదు. దీని వెనుక ఉన్న అసలు ఆలోచన Hardware, Software, Research, Skills, Startups, Industry Applications, Testing Facilitiesలను ఒకే ecosystemలో అనుసంధానించడం.

C-DOTతో కుదిరిన భాగస్వామ్యాన్ని వివరించిన కేంద్ర ప్రభుత్వ ప్రకటన కూడా Amaravati Quantum Valley లక్ష్యాన్ని hardware manufacturing, software development, talent development, research excellenceలను కలిపిన integrated quantum ecosystemగా పేర్కొంది. ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రయత్నానికి ప్రత్యేకత.

IBM–TCS–Andhra Pradesh: 156-Qubit Quantum System

IBM, Tata Consultancy Services, Andhra Pradesh Government 2025 మేలో ప్రకటించిన ప్రణాళిక ప్రకారం అమరావతిలో ఏర్పాటు చేయనున్న IBM Quantum System Twoలో 156-qubit Heron processor ఉంటుంది. IBM, TCS ప్రకటనల ప్రకారం ఇది ప్రస్తుతం ప్రణాళికలో ఉన్న భారతదేశపు అతిపెద్ద Quantum Computer deployment. TCS దీన్ని ఆధారంగా చేసుకొని algorithms, applications, industry-use cases అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతోంది.

2026 సెప్టెంబర్ నాటికి ఈ flagship systemను పూర్తిగా operational systemగా కాకుండా, commissioning దిశగా ఉన్న projectగా చూడాలి. కాబట్టి అసలు ప్రయాణం machine installationతో ముగియదు; అక్కడి నుంచే మొదలవుతుంది.

Quantum Reference Facilities — మరింత ముఖ్యమైన అడుగు

ఒక విదేశీ సంస్థ తయారు చేసిన Quantum Computerను కొనుగోలు చేయడం ఒక విషయం. అలాంటి కంప్యూటర్ పనిచేయడానికి అవసరమైన Hardware, Cryogenic Systems, Electronics, Sensors, Control Systems, Componentsను భారతదేశంలోనే అభివృద్ధి చేయడం మరో విషయం.

SRM University-AP మరియు Medha Towersలో Quantum Reference Facilities ఏర్పాటు చేయబడ్డాయి. ఇవి testing, validation, benchmarking, certification మరియు real-world quantum hardware experimentationకు ఉపయోగపడే open-access facilities.

2026 జూన్‌లో Medha Towersలోని indigenous dilution refrigerator 4 Kelvin — సుమారు −269°C ఉష్ణోగ్రతను చేరింది. ఇది భారతదేశాన్ని “Quantum Computer User” స్థాయి నుంచి “Quantum Technology Producer” స్థాయికి తీసుకెళ్లే దిశలో ప్రాముఖ్యమైన అడుగు.

విద్యార్థుల నుంచి Quantum Workforce వరకు

Technologyలో infrastructure ఎంత ముఖ్యమో manpower అంతకంటే ముఖ్యమైనది. Quantum Computingలో Physics తెలిసినవారు మాత్రమే కాదు; Mathematics, Computer Science, Electronics, Materials Science, Cryogenics, Microwave Engineering, Photonics, Software Development వంటి అనేక రంగాల నిపుణులు అవసరం.

ఆంధ్రప్రదేశ్ engineering collegesలో Quantum Innovation Cells ఏర్పాటు చేసే వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. విద్యార్థులు, అధ్యాపకులు use cases, algorithms, industry problemsపై పనిచేసేలా ecosystemను విస్తరించే ప్రయత్నం జరుగుతోంది.

Quantum & AI University Campus

2026 ఫిబ్రవరిలో NIELIT మరియు Andhra Pradesh Government అమరావతిలో India’s first dedicated Quantum and Artificial Intelligence University campus ఏర్పాటు చేయడానికి MoU కుదుర్చుకున్నాయి. ఇది అమలైతే Amaravati Quantum Valleyకి ఒక నిరంతర talent pipeline ఏర్పడే అవకాశం ఉంటుంది.

ఇతర భారత రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత

Quantum Researchలో Andhra Pradesh ఒక్కసారిగా భారతదేశంలోని ఇతర కేంద్రాలను వెనక్కి నెట్టిందని చెప్పడం సరైంది కాదు. Bengaluruలో IISc Quantum Computing researchకు ప్రధాన కేంద్రం. IIT Madras Quantum Communicationలో, IIT Bombay Quantum Sensing and Metrologyలో, IIT Delhi Quantum Materials and Devicesలో, IIT Kanpur advanced quantum infrastructureలో కీలక పాత్రలు పోషిస్తున్నాయి.

Andhra Pradesh ప్రత్యేకత ఏమిటంటే — research institution చుట్టూ కాకుండా, ఒక రాష్ట్రం మొత్తం innovation ecosystemను Quantum Valley రూపంలో నిర్మించడానికి ప్రయత్నిస్తోంది. Computer, industry, education, testing, startups, applications, manufacturing ambitions అన్నింటినీ geographic clusterగా కలపాలని చూస్తోంది.

భారతదేశం ఎంత సిద్ధంగా ఉంది?

భారత ప్రభుత్వం 2023లో National Quantum Missionను ₹6,003.65 కోట్ల వ్యయంతో 2023–24 నుంచి 2030–31 వరకు అమలు చేయడానికి ఆమోదించింది. Mission లక్ష్యాల్లో 50 నుంచి 1,000 physical qubits వరకు intermediate-scale quantum computers అభివృద్ధి చేయడం, quantum communication, sensing, materials, devices రంగాల్లో indigenous capability పెంచడం ఉన్నాయి.

ప్రపంచ Quantum Raceలో భారత్ ఎక్కడ ఉంది?

ఈ ప్రశ్నకు ఒకే ర్యాంక్ చెప్పడం సరైంది కాదు. Quantum Leadershipను Research, Hardware, Patents, Investment, Talent, Startups, Commercialisation, Supply Chain వంటి అంశాలపై చూడాలి.

MIT Quantum Index Report 2025 ప్రకారం 2019–2023 మధ్య ప్రపంచ Quantum Computing research publicationsలో India సుమారు 5% వాటాతో కనిపించింది. ఇది చిన్న విషయం కాదు. కానీ Research Papers మాత్రమే technological leadershipను నిర్ణయించవు.

Indiaకు talent, software capability, engineering workforce, National Quantum Mission, growing infrastructure వంటి బలాలు ఉన్నాయి. అయితే advanced indigenous hardware, patents, private capital, commercial products, domestic quantum supply chain వంటి రంగాల్లో ఇంకా గణనీయమైన gaps ఉన్నాయి.

ఇక్కడే Amaravati పాత్ర మొదలవుతుంది

IBM machine ద్వారా access, TCS ద్వారా applications, Quantum Reference Facilities ద్వారా hardware testing, Universities ద్వారా talent, Innovation Cells ద్వారా student participation, C-DOT ద్వారా communication and security, Startups ద్వారా commercialisation, Manufacturing ecosystem ద్వారా indigenous components — ఈ chain పనిచేస్తే Amaravati significance చాలా పెరుగుతుంది.

పనిచేయకపోతే ఒక costly imported machine, కొన్ని buildings, MoUsతో project పరిమితమయ్యే ప్రమాదం ఉంటుంది.

Quantum Valley విజయాన్ని ఎలా కొలవాలి?

  • ఎన్ని Quantum Patents వచ్చాయి?
  • ఎన్ని Indian components తయారయ్యాయి?
  • ఎన్ని Startups sustainable companiesగా మారాయి?
  • ఎన్ని students hands-on quantum training పొందారు?
  • ఎన్ని industry problemsకు practical quantum solutions అభివృద్ధి అయ్యాయి?
  • ఎంత domestic intellectual property సృష్టించబడింది?
  • ఎంత technology export చేయగలిగాం?

నా అభిప్రాయం:

ఆంధ్రప్రదేశ్ Quantum Computingలో ఒక ఆసక్తికరమైన ప్రయోగం చేస్తోంది. ఇప్పటివరకు భారతదేశంలో Quantum capability ప్రధానంగా leading research institutions చుట్టూ అభివృద్ధి చెందింది. Amaravati model మాత్రం research, industry, education, infrastructure, testing, startups, applications, manufacturingను ఒక geographic ecosystemగా కలపాలని ప్రయత్నిస్తోంది.

156-qubit machine రావడం headline. దాన్ని ఉపయోగించి Indian algorithm రావడం progress. Indian patent రావడం innovation. Indian component తయారవడం self-reliance. Indian startup global marketలో అమ్మడం commercial success.

భారతదేశం కూడా ఇదే మలుపులో ఉంది. మన దగ్గర talent ఉంది. Research base ఉంది. National Quantum Mission ఉంది. IT industry ఉంది. Large domestic market ఉంది. ఇప్పుడు కావలసింది Researchను Intellectual Propertyగా, IPని Productగా, Productను Global Businessగా మార్చే సామర్థ్యం.

అమరావతి ఆ మార్పుకు ఒక ముఖ్యమైన కేంద్రంగా మారగలిగితే — ఆంధ్రప్రదేశ్ ఒక Quantum Computerకు చిరునామాగా మాత్రమే కాదు, భారతదేశ Quantum Futureను నిర్మించిన ప్రదేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందుతుంది. అదే నిజమైన Quantum Leap.

English

Is Amaravati Ready for the Quantum Era?

Andhra Pradesh and India’s Place in the Global Quantum Race

Artificial Intelligence is transforming the present. Quantum computing may reshape a part of computing’s future. It will not replace ordinary computers, but its potential lies in addressing specific classes of exceptionally difficult problems in drug discovery, materials science, finance, logistics, optimisation, cryptography and cybersecurity.

Against this backdrop, Andhra Pradesh is attempting something unusual: building not merely a quantum-computing facility but an integrated quantum ecosystem around Amaravati.

More than a quantum computer

The Amaravati Quantum Valley initiative seeks to connect hardware, software, research, education, startups, testing infrastructure and industrial applications. This integrated approach is what makes the Andhra Pradesh experiment noteworthy.

The IBM–TCS–Andhra Pradesh partnership

IBM, TCS and the Government of Andhra Pradesh announced plans in May 2025 for Amaravati’s Quantum Valley Tech Park to be anchored by an IBM Quantum System Two with a 156-qubit Heron processor. TCS is also working with IBM on algorithms, applications and industry-oriented use cases.

As of September 2026, the distinction between announced capacity and operational maturity remains important. The flagship machine is still moving toward commissioning. The real test begins after installation: how extensively will Indian researchers, companies and students use the infrastructure to generate new intellectual property and commercially useful applications?

Building indigenous capability

Potentially more important in the long run are Amaravati’s Quantum Reference Facilities at SRM University-AP and Medha Towers. They are intended as open-access environments for hardware testing, validation, benchmarking and component development.

In June 2026, an indigenous dilution refrigerator at Medha Towers reached 4 Kelvin, about −269°C. This represents an important step toward moving India from being merely a user of quantum systems toward becoming a producer of quantum technologies.

Talent as infrastructure

Andhra Pradesh is trying to expand quantum participation across engineering institutions through Quantum Innovation Cells and industry-linked use cases. This may ultimately matter as much as the computer itself. A quantum system used by a small research group produces scientific capability; a network of students, faculty, startups and companies learning to use quantum systems can create an economic ecosystem.

Quantum & AI University Campus

In February 2026, NIELIT and the Government of Andhra Pradesh signed an MoU to establish what the Union Government described as India’s first dedicated Quantum and Artificial Intelligence University campus in Amaravati. If implemented effectively, it could create a long-term talent pipeline for the Valley.

How Andhra Pradesh compares with the rest of India

India already possesses major quantum research centres. IISc Bengaluru is a central force in quantum computing research. IIT Madras has a major role in quantum communication. IIT Bombay is important in sensing and metrology. IIT Delhi works on quantum materials and devices, while IIT Kanpur is also developing advanced quantum infrastructure.

Andhra Pradesh’s distinction is therefore not that it has displaced these centres. Its experiment is different: it is attempting to geographically integrate a large quantum system, industry, education, testing, applications, startups and manufacturing ambitions into a single state-led cluster.

India’s national foundation

India’s National Quantum Mission was approved with an allocation of ₹6,003.65 crore for 2023–24 to 2030–31. Among its targets is the development of intermediate-scale quantum computers with 50 to 1,000 physical qubits, alongside quantum communication, sensing, materials and devices.

Where does India stand globally?

There is no credible single ranking that captures quantum leadership. Countries must be compared across research, talent, patents, hardware, investment, startups, supply chains and commercialisation.

The MIT Quantum Index Report 2025 estimated India’s share of global quantum-computing research publications during 2019–2023 at about 5%. India also has structural strengths in talent, software capability, engineering manpower, its National Quantum Mission and a rapidly expanding research ecosystem.

However, major gaps remain in advanced indigenous hardware, patent ownership, private capital, commercial products and domestic quantum supply chains. India is therefore no longer outside the quantum race, but it is not yet equivalent across all dimensions to the most mature ecosystems in the United States, China and parts of Europe.

Why Amaravati matters

India’s challenge is increasingly one of conversion: research must become intellectual property; intellectual property must become products; products must become companies; and companies must enter global markets.

The IBM system can provide computing access. TCS can help develop applications. Reference facilities can support hardware experimentation. Universities can build talent. C-DOT can strengthen quantum communication and security. Startups can convert research into products, while local manufacturers can begin building components.

How should success be measured?

  • How many patents emerge?
  • How much quantum hardware is developed domestically?
  • How many viable startups are created?
  • How many students gain hands-on capability?
  • How many Indian industries deploy useful quantum applications?
  • How much global research and investment does the Valley attract?
  • How much technology can India eventually export?

My assessment:

Andhra Pradesh is attempting one of India’s most integrated state-level quantum ecosystem models. But infrastructure is only the beginning.

A 156-qubit system is a headline. An Indian algorithm created on it is progress. An Indian patent is innovation. An Indian-built critical component is technological self-reliance. An Indian quantum company selling globally is commercial success.

If Amaravati contributes meaningfully to that transition, Andhra Pradesh will not simply host a large quantum computer. It could help shape India’s quantum future. That would be the real Quantum Leap.


Key Sources

I Reflect. You Respond.

#MVRTalks #QuantumComputing #Amaravati #AndhraPradesh #QuantumValley #NationalQuantumMission #DeepTech #Innovation #FutureTechnology #IndianEconomy #QuantumTechnology #IReflectYouRespond