పనుల మధ్య పది నిమిషాల Buffer Time ఎందుకు అవసరం?
ప్లాన్లో ఖాళీ కూడా పని చేస్తుంది! ⏳
ఒక పని 8:00కి ముగుస్తుందని రాసి, తర్వాతి పని కూడా 8:00కే మొదలవుతుందని ప్లాన్ చేస్తాం. మధ్యలో ప్రయాణం, పుస్తకం వెతకడం, చిన్న phone call—వీటికి సమయం ఎవరు ఇస్తారు? చివరకు తప్పు గడియారానిదే అన్నట్లు దానివైపు చూస్తాం! 😄
మంచి Time Management అంటే ప్రతి నిమిషాన్నీ పనులతో నింపడం కాదు. రోజులో ముఖ్యమైన పనులకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు, వాటి మధ్య కొంత ఖాళీ ఉంచడమూ అవసరమే.
రెండు ముఖ్యమైన పనుల మధ్య 10 నిమిషాల buffer ఉంటే, అది అనుకోని ఆలస్యాన్ని గ్రహిస్తుంది; మనసుకు ఊపిరినిస్తుంది; తర్వాతి పనిని ప్రశాంతంగా ప్రారంభించడానికి సహాయపడుతుంది. నిర్ణయించిన సమయానికి పనిని ప్రారంభించడం ఒక శిక్షణ అయితే, ఆ ప్రారంభానికి అవసరమైన సమయాన్ని ముందుగానే కేటాయించడం తెలివైన ప్రణాళిక.
ఒక తండ్రిగా నా ఆశ—పిల్లలు వేగంగా పరుగెత్తడం మాత్రమే కాదు, తొందరపడాల్సిన పరిస్థితి రాకుండా ముందే స్థలం ఉంచుకోవడం నేర్చుకోవాలి. నిండిపోయిన timetable క్రమశిక్షణకు గుర్తు కాదు; అమలు చేయగల timetableే నిజమైన క్రమశిక్షణ.
🎯 A Father’s Dream:
జీవితంలో లక్ష్యాలు నిండుగా ఉండాలి; కానీ వాటి మధ్య ఆలోచించడానికి, సర్దుకోవడానికి కొంచెం ఖాళీ కూడా ఉండాలి.
ఈరోజు ఆచరణ:
ఈరోజు మీ రెండు ముఖ్యమైన పనుల మధ్య 10 నిమిషాల buffer పెట్టండి. ఆ సమయాన్ని మరో పనితో నింపకుండా, మార్పుకు మాత్రమే ఉపయోగించండి.
I Reflect. You Respond.
#MVRTalks #AFathersDream #TimeManagement #BufferTime #SmartPlanning #Punctuality #ParentingThoughts #IReflectYouRespond
Comments
Comments are reviewed before appearing publicly.