సరిహద్దు చర్చలు… శీ పర్యటనకు ముందుమాటా?
🇮🇳🤝🇨🇳
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆగస్టు 24న రెండు రోజుల పర్యటనకు బీజింగ్ చేరుకున్నారు. ఆగస్టు 25న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భారత్–చైనా సరిహద్దు అంశంపై 25వ Special Representatives చర్చలకు సహాధ్యక్షత వహించనున్నారు. చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్‌నూ కలవనున్నారు.
ఈ సమావేశం కేవలం మరో diplomatic diary entry కాదు. 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 2024 disengagement understanding కొంత ఉపశమనం ఇచ్చినా, సరిహద్దు వివాదం పరిష్కారం కాలేదు. అందుకే border peace రెండు దేశాల సంబంధాలకు పునాది అని భారత్ స్పష్టం చేస్తోంది.
ఇదే సమయంలో, చైనా అధ్యక్షుడు శీ జిన్‌పింగ్ సెప్టెంబర్ 12–13న న్యూఢిల్లీలో జరిగే BRICS Summitకు సుమారు 400 మంది ప్రతినిధులతో రావచ్చని Reuters తెలిపింది. అయితే ఇది ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. పర్యటన జరిగితే, ఏడేళ్లలో ఆయన తొలి భారత పర్యటన అవుతుంది.
BRICS వేదికలో వాణిజ్యం, ప్రపంచ పాలన, అంతర్జాతీయ ఒత్తిళ్లు చర్చకు రావచ్చు. కానీ ఫోటోలో చిరునవ్వులు కనిపించాయని LAC సమస్యలు కూడా selfieలా వెంటనే clear అయిపోయాయని భావించలేం.
నా అభిప్రాయం:
సంభాషణ పునఃప్రారంభం సానుకూలమే; కానీ నిజమైన పురోగతికి మూడు కొలమానాలు అవసరం—సరిహద్దులో స్థిరత్వం, ఒప్పందాల అమలు, పరస్పర విశ్వాసం. భారత్‌కు ఆర్థిక సహకారం అవసరమే; భద్రతా ఆందోళనలను పక్కన పెట్టే ధరకు కాదు. Summit diplomacy headline ఇస్తుంది; నేలమీద శాంతి మాత్రమే history రాస్తుంది.
మూలాలు:
I Reflect. You Respond.
#MVRTalks #IndiaChina #BorderTalks #BRICS2026 #IndianDiplomacy #Geopolitics #PublicAffairs #IReflectYouRespond
Comments
Comments are reviewed before appearing publicly.